శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రాయదుర్గంలో త్రాగునీటి పథకం అమృత్ 2.0 పనులకు భూమి పూజ

24 జూన్, 2026

Groundbreaking ceremony for Amrut 2.0 drinking water scheme in Rayadurgam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 04:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం పట్టణంలో అమృత 2.0 పథకం కింద 78 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన త్రాగునీటి పథకం పనులకు స్థానిక శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు బుధవారం భూమి పూజ చేశారు. పట్టణంలోని నీటి శుద్ధి కేంద్రం వద్ద జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో త్రాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు కేంద్ర ప్రభుత్వ సాయంతో అమృత్ 2.0 పనులను చేపట్టినట్లు తెలిపారు. జిందాల్ వాటర్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ రెండేళ్లలోగా ఈ పనులను పూర్తి చేస్తుందన్నారు. దీనివల్ల పట్టణంలో త్రాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. పట్టణ శివారు ప్రాంతాలలో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు ఎస్ఎస్ ట్యాంకు నుండి 16 కిలోమీటర్ల మేరకు కొత్త పంపింగ్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తారన్నారు. కొత్తగా 6250 కొళాయి కనెక్షన్లను ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ప్రత్యేక అధికారి రామకృష్ణారెడ్డి, కమిషనర్ దివాకర్ రెడ్డి, ప్రజారోగ్య శాఖ ఈ ఈ సూర్యనారాయణ, డి సురేష్, కేతన్, జిందాల్ సంస్థ మేనేజర్ శ్రీనివాస్, టిడిపి నాయకులు హనుమంతు, కృష్ణమూర్తి, పురుషోత్తం, మహబూబ్ బాషా వెంకటేశులు, భారతి, ప్రశాంతి, సంపత్ కుమారి పాల్గొన్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్