శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర కార్యదర్శిగా మీనుగ నాగేంద్రబాబు

1 గంట క్రితం

Minuga Nagendra Babu appointed as State Secretary of the National Human Rights Commission
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 12:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విద్యా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియామకం


ప్రజాశక్తి -అనంతపురం : జాతీయ మానవ హక్కులు, సామాజిక న్యాయ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా విభాగం కార్యదర్శిగా అనంతపురం పట్టణానికి చెందిన మీనుగ నాగేంద్రబాబు నియమితులయ్యారు. ఈ మేరకు కమిషన్ జాతీయ అధ్యక్షులు, వ్యవస్థాపకులు డాక్టర్ మెహతాబ్ రాయ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నియామకం ఏడాది పాటు అమల్లో ఉండనుంది. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, సామాన్య ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని నియామక ఉత్తర్వుల్లో సూచించారు.సమాజంలోని వివిధ వర్గాలకు తమ హక్కులపై అవగాహన కల్పిస్తూ, కమిషన్ కార్యకలాపాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చురుకైన పాత్ర పోషించాలని జాతీయ అధ్యక్షులు ఆకాంక్షించారు.అనంతపురానికి చెందిన నాగేంద్రబాబుకు రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్