ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో ఉన్న ఇండోర్ స్టేడియం పెవిలియన్ సమీపంలో దీపావళికి టపాసుల విక్రయ దుకాణాలకు అనుమతివ్వాలని విద్యాధికారులను పలువురు టపాసుల విక్రయ దుకాణదారులు కోరారు. దీపావళి పండగ అనంతరం అపరిశుభ్రంగా మారి ఆకతాయిలకు అడ్డాగా మారిన ఇండోర్ స్టేడియం పెవిలియన్ ను పరిశుభ్రం చేయడం తో పాటు ఇటివల చెట్టు కూలి పడిపోయిన ప్రహరీ గోడను కూడా నిర్మిస్తాం అని అధికారులను కోరారు. మండల విద్యాధికారి కృష్ణయ్య మాట్లాడుతూ జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి చెప్తానని దుకాణదారులకు తెలిపారు... పెవిలియన్ సమీపంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని టపాసుల దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని అదే విధంగా అధ్వానంగా ఉన్న పెవీలియన్ శుభ్రం కావడంతో పాటు పడిపోయిన ప్రహరీ గోడ కూడా నిర్మాణం అవుతుందని పలువురు క్రీడాకారులు వాకర్లు కోరుతున్నారు.
విద్యాధికారులకు పటాసుల విక్రయదారుల విన్నపం
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 09:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)