గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈ-పంట నమోదుపై సూపర్ చెక్

1 గంట క్రితం

atp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 12:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్

ప్రజాశక్తి -రాప్తాడు : రాప్తాడు మండలంలో ఖరీఫ్ 2026 సీజన్ లో నమోదు అయిన ఈ-పంట వివరాలను గురువారం క్షేత్రస్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలన (సూపర్ చెక్) చేశారు. ఇందులో భాగంగా రాప్తాడు రెవెన్యూ గ్రామంలోని 337-4పి సర్వే నెంబర్ లోని చీనీ, మరియు 337-4bలో చీనీ పంటలను జాయింట్ కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా రైతులతో వారు సాగు చేసిన పంటల వివరాలను జెసి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. సాలురెడ్డి, రాప్తాడు తహసీల్దార్ చెన్నకేశవులు, అనంతపురం డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వెంకటాకుమార్, మండల మండల వ్యవసాయ అధికారి కృష్ణ చైతన్య , సాంకేతిక వ్యవసాయ అధికారి రాకేష్ నాయక్, రెవెన్యూ గ్రామాల విఆర్ఓ, విఏఓ, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్