- వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి
ప్రజాశక్తి-నార్పల: నార్పల మండలంలో గతంలో ఎంతో అభివృద్ధి చేశామని నార్పల సత్యనారాయణ రెడ్డి అన్నారు. నార్పల మండల కేంద్రలోని ఆయన నివాసంలో జేడీపీటిసి అభ్యర్థి శివానందరెడ్డి, ఎంపీపి అభ్యర్థి ఎన్. స్వాతిలత మీడియా సమావేశం నిర్వహించారు. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేళ్లలో మండలంలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని ఆరోపించారు. మండలంలోని యువతలో కొందరు చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తుపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలో అభివృద్ధి, యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించాలంటే ప్రజలు తమ ఓటుతో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
జెడ్పిటిసి అభ్యర్థి శివానందరెడ్డి మాట్లాడుతూ... నార్పల మండల అభివృద్ధే మా లక్ష్యం. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రజల ఆశీర్వాదంతో గెలిపిస్తే మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను అని తెలిపారు.ఎంపీపీ అభ్యర్థి ఎన్.స్వాతిలత మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా మహిళలు, యువత, పేద కుటుంబాల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాను. గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాను. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ప్రజలందరూ ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మండలంలోని జెడ్పిటిసి,అన్ని ఎంపీటీసీ స్థానాల వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.







కామెంట్లు (0)