బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్యాసింజర్ రైలు వెళ్లిన 45 నిమిషాలకే పేలుడు .. రైల్వే ట్రాక్ ధ్వంసం

1 గంట క్రితం

Explosion occurs 45 minutes after a passenger train passes railway track destroyed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజస్థాన్ : భారత్‌–పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో భారీ పేలుడు కలకలం సృష్టించింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. ఓ ప్యాసింజర్‌ రైలు ఆ మార్గంలో ప్రయాణించిన కొద్దిసేపటికే పేలుడు సంభవించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీంతో అనూప్‌గఢ్‌–సూరత్‌గఢ్‌ మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.


రైల్వే ట్రాక్‌పై 50 జీబీ పాయింట్‌ సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. దీని ప్రభావానికి ట్రాక్‌కు ఆధారంగా ఉన్న రెండు కాంక్రీట్‌ పిల్లర్లు దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి అక్కడ సుమారు రెండు అడుగుల లోతులో గుంత ఏర్పడింది. భారీ శబ్దం వినిపించిందని సమీప గ్రామాల ప్రజలు వెల్లడించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. యాంటీ టెర్రరిజం బృందాలు, బాంబు నిర్వీర్య దళాలు అక్కడ తనిఖీలు చేపట్టాయి.


రైలును లక్ష్యంగా చేసుకుని కుట్ర జరిగిందా ?

అనూప్‌గఢ్‌ జంక్షన్‌ నుంచి ఓ ప్యాసింజర్‌ రైలు బయలుదేరిన సుమారు 45 నిమిషాల అనంతరం ఈ పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రైలు వెళ్లిన తర్వాత పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే ప్రయాణికుల రైలును లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి కుట్ర పన్నారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఇటీవల ఇదే సరిహద్దు ప్రాంతంలోని శ్రీగంగానగర్‌ పరిసరాల్లో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధాలు, ఆర్డీఎక్స్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తాజా పేలుడు ఘటనకు ఆ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా ? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడుకు గల కారణాలు, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్