బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డెమోక్రాట్ల విజయంపై ఒబామా హర్షం

1 గంట క్రితం

Obama
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 12:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటినీ డెమోక్రాట్‌ కైవసం చేసుకుంది. డెమోక్రాట్ల విజయంపై అమెరికా మాజీ అధ్యక్ష‍ుడు ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాత్రి అమెరికా ప్రజలు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారని అన్నారు. ప్రజలను విభజించే రాజకీయాలను కాకుండా, వారిని ఏకం చేసే రాజకీయాలను, వారు ఎదుర్కొంటున్న సవాళ్లకు నిర్దిష్ట పరిష్కారాలను అందించే నేతలను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో, ఒకప్పుడు గెలుపు అసాధ్యం అనుకున్న ప్రాంతాలతో సహా, అత్యుత్తమ అభ్యర్థుల కారణంగానే ఈ ఫలితం సాధ్యమైందని అన్నారు. విభిన్ననేపథ్యాలు, విభిన్న రాజకీయ దృక్పథాలకు ప్రాతినిధ్యం వహించారు కానీ ఉమ్మడి విలువలు, ప్రజాసేవపై నమ్మకం, తమ రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే నిబద్ధతతో ఏకమయ్యారని అన్నారు. "సజావైన ఎన్నికలు సజావుగా జరిగేలా చూసిన ఎన్నికల అధికారులు, వాలంటర్లీకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిపాలనా యంత్రాంగానికి ఇంకారెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ, ఇప్పుడు మనం కష్టపడి పనిచేయడం, మనకు అధికారం ఉన్న చోట మార్పులు తీసుకురావడం, మరిన్ని నష్టాలను నివారించడం , భవిష్యత్తుకు పునాది వేయాలని అన్నారు.


మధ్యంతర ఎన్నికలలో ఎదురైన ఓటమిని తన అధ్యక్ష పదవికి వచ్చిన తీర్పుగా తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మీడియాతో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పరంగా , అన్ని పనుల పరంగా చూస్తే, తన అధ్యక్ష పదవి చరిత్రలోనే అత్యుత్తమమైన రెండేళ్లను తాము చూశామని అన్నారు. తమ ఓటమికి రిపబ్లికన్ అభ్యర్థులే కారణమని ఆరోపించారు. వారిలో కొందరు తన ఓటర్లను ప్రొత్సహించడంలో విఫలమయ్యారని అన్నారు. డెమోక్రాట్‌లకు అభినందనలు తెలిపారు. 11 ఏళ్లుగా గెలుపుకోసం ఎదురుచూస్తున్నారని, చివరకు సాధించారని ట్రంప్‌ అక్కసు వెళ్లగక్కారు.


మీడియా ప్రకారం.. ఇరాన్‌పై యుద్ధం, సుంకాలను వ్యతిరేకిస్తూ నాలుగు కీలక వర్గాలైన యువత, స్వతంత్ర, గ్రామీణ, హిస్పానిక్ ఓటర్లు పెద్ద సంఖ్యలో రిపబ్లికన్లను ఓడించారు. దీంతో రిపబ్లికన్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో కూడా డెమోక్రాట్లు విజయకేతనం ఎగురవేశారు. ఇందులో భాగంగా సౌత్ కరోలినాలో ఒక సెనేట్ సీటును, 1994 నుండి డెమొక్రాట్లకు ఓటు వేయని టెక్సాస్‌లో మరొక సీటును గెలుచుకున్నారు. జాన్సా సెనేట్ సీటును గెలుచుకోవడంతో పాటు సుమారు 100 సంవత్సరాల రిపబ్లికన్ ఆధిపత్యాన్ని కూడా బద్దలు కొట్టింది.య సిఎన్ఎన్‌ కథనం ప్రకారం, ద్రవ్యోల్బణం, ట్రంప్ విధించిన సుంకాలు, ఇరాన్ యుద్ధం, ట్రంప్ వ్యవహారశైలి, వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం అధికారాన్ని వినియోగించుకుంటున్నారన్న ఓటర్ల ఆందోళనలు ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే, కమిటీ విచారణలు, బహిరంగ విచారణలు, సమన్ల ద్వారా అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రభుత్వంపై కాంగ్రెస్ పర్యవేక్షణను గణనీయంగా పెంచే అవకాశం ఉంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్