ప్రజాశక్తి-కదిరి : రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా జెడ్ పి చైర్మన్ స్థానాన్ని జనరల్ కి కేటాయించడంతో శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ జెడ్ పి చైర్మన్ అభ్యర్థిగా కదిరికి చెందిన వైసిపి నేత వజ్ర భాస్కర్ రెడ్డినీ వైసీపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ ఆవిర్భావం నుండి వజ్ర భాస్కర్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నారు.గతంలో 2019 ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి పార్టీ భంగపడి అప్పట్లో వైసీపీని వీడి బీజేపీ లో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తిరిగి వైసీపీ లో చేరారు. వజ్ర భాస్కర్ రెడ్డి పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని గతంలో లోటును భర్తీ చేసేలా ఆయన కి జెడ్ పి చైర్మన్ గా అవకాశం లభించిందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ జెడ్ పి చైర్మన్ అభ్యర్థిగా వజ్ర భాస్కర్ రెడ్డి!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 10:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)