- స్థానిక ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చే వారికే ఓటు
ప్రజాశక్తి-నార్పల: మండల కేంద్రమైన నార్పలలో ఉన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారం చూపే వారికే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయాలని పలువురు నార్పల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నార్పలలో ముఖ్య0గా పందులు, కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉందని నార్పల రోడ్లు మీద మనుషులతో పాటు పందులు, కుక్కలు, కోతులు కూడా సంచరిస్తూ ఉంటాయి అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో నార్పల రోడ్డుపై ద్విచక్ర వాహనాల క్రిందకు పందులు, కుక్కలు దూరి పదుల సంఖ్యలో వాహన దారులు తీవ్రంగా గాయపడ్డారు. అదేవిదంగా కొందరు కాళ్ళు చేతులు విరగకొట్టుకున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి ఎన్ని సార్లు తీసుకుని వెళ్లిన ఫలితం లేదని నార్పలలో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది అని ప్రజలు అంటున్నారు. దీనికి తోడు పారిశుద్ధ్య సమస్య కూడా ఎక్కువగా ఉంది అని అధికారులు పొడి, తడి చెత్త సేకరణ కోసం చెత్త బుట్టలు పంపిణీ చేసి ప్రతిరోజు గార్బేజ్ రిక్షాలు ఇళ్ల వద్దకు పంపుతున్న కొందరు చెత్త ను అందులో వేయకుండా రోడ్డు మీద వేస్తున్నారు స్థానిక గూగుడు రోడ్డు లో ఉండే పలువురు వ్యాపారులు, నివాసాలు ఉండే వారు రాత్రి సమయంలో చెత్త చెదారం ను రోడ్డు మీద పడేస్తున్నారు దీనితో ఆ చెత్తాలో పందులు కెలకడం వలన నార్పల మెయిన్ రోడ్డు మొత్తం ఉదయం పూట దుర్గంధ భరితంగా మారి పాదచారులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూగుడు రోడ్డుపై చెత్తను వేసే వ్యాపారులు, పై తగిన చర్యలు తీసుకోవడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు జంకుతున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిదంగా మండల కేంద్రం అయిన నార్పలలతో పాటు మండల పరిధి లోని పలు గ్రామాల్లో, ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా నే ఉంది త్వరలోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి మండలం లో తాగునీటి ఎద్దడి నివారణ. పందులు, కుక్కలు, కోతుల నిర్ములన, పారిశుద్ధ్య సమస్యలు, విధి లైట్లు నిర్వహణ తదితర సమస్యలు పరిష్కారంపై ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో అటువంటి వారికే ఓటు వేసి ఎన్నుకొంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది అని అలా కాకుండా డబ్బుకు ఆశపడో, కులా అభిమానం తో ఓట్లు వేస్తే మీ జీవితలతోపాటు భవిష్యత్ తరాల జీవితలను కూడా అంధకారంలో కి నెట్టిన వారు ఔతారు అని ఇప్పటికైనా నార్పల ఓటర్లు విచక్షణ జ్ఞానం ఆలోచించి ఓటు వేయాలని పలువురు అంటున్నారు.
1. ద్విచక్ర వాహనాల కిందికి కుక్కలు పందులు దూరి గాయపరుస్తున్నాయి : తేరుకాటి షేక్షావలి
నార్పల మండల కేంద్రం అయిన నార్పల ప్రధాన రహదారులపై పై పని నిమిత్తం వెళ్తున్న ద్విచక్ర వాహనదారుల వాహనాల కిందకు కుక్కలు పందులు దూరి వాహనదారులను గాయపరుస్తున్నాయి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నార్పల లో పందులు, కుక్కలు, కోతులు నివారణకు స్పష్టమైన హామీ ఇచ్చిన వారికే ఓటు వేయాలి.
2. గూగుడు రోడ్డు లో చెత్త వేసే వారిపైచర్యలుతీసుకోవాలి : గంజిగుంట ప్రభాకర్...
మండల కేంద్రమైన నార్పల మెయిన్ రోడ్డు అయిన గూగుడు రోడ్డు లో చెత్త వేసే వారి పై చర్యలు తీసుకోవాలని వారి పై చర్యలు తీసుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వెనకడుగు వేస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరికీ సమ న్యాయం చేసి గ్రామ పారిశుద్ధ్యం పై స్పష్టమైన హామీ ఇచ్చే వారికే ఓటు వేయాలి.
3. తాగునీటి సమస్యను పరిష్కరించాలి: కొలిమి ముస్తఫా
మండల కేంద్రం అయిన నార్పలలో తాగునీటి నీటి సమస్యను పరిష్కరించాలని. మండలకేంద్రం లో వేసవి కాలం లో కొన్ని కాలనీల్లో నాలుగు, ఐదు రోజుల కు ఒకసారి కూడా నీరు రాదు అని నార్పలలో నీటి సమస్యను పరిష్కరనికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను నిర్మించి పూర్తీ స్థాయి లో నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వారికి ఓటు వేయాలి.
4. పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలి : బేకరి శేషు
నార్పల మండల కేంద్రమైన నార్పలలో డ్రైనేజీ కాలవలు సరిగ్గా తొలగించక పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా నెలకొంది చిన్నారులు వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని ఎప్పటికప్పుడు డ్రైనేజీ కాలవలు తొలగిస్తూ పారిశుద్ధ్య సమస్య పై స్పష్టమైన హామీ ఇచ్చే వారికి ఓటు వేయాలన్నారు.
.5. నార్పలలో బస్టాండ్ సమస్య పరిష్కారం చూపే వారికే ఓటు: ప్రకాష్
నార్పల మండల కేంద్రం అయిన నార్పల లో బస్టాండ్ సౌకర్యం కల్పించాలని కొత్త బస్టాండ్ నిర్మించిన దాన్ని వినియోగించక పోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది స్థానిక పాత బస్టాండ్ లోని పంచాయతీ కాంప్లెక్స్లను నిర్మించి పంచాయతీ ఆదాయం పెంచారు కానీ ప్రయాణికులు సమస్యలను మరిచారని పాత బస్టాండ్ లో ఉన్నటువంటి కాంప్లెక్స్ ను తొలగించి వాటి స్థానంలో లో బస్ స్టాండ్ ను నిర్మించి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చే వారికే ఓటు వేయాలన్నారు.
6. నిష్పక్షపాత పాలన అందించే వారికే ఓటు : జాఫర్ వలి. నార్పల
కులాలు మతాలు వర్గాలకు అతీతంగా నిష్పక్షపాత పాలన అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వారి ని అదేవిధంగా గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల కు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే వారికి ఓటు వేయాలని అన్నారు..
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : నిచ్చిన మెట్ల సురేష్ కుమార్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చేవారిని చూసి ఓటు వేసి నార్పల అభివృద్ధికి ప్రజలందరూ సహకారం అందించాలని డబ్బు తీసుకొని ఓటు వేస్తే పవిత్రమైన ఓటును అపవిత్రం చేసిన వారు అవుతారని పార్టీ ఏదైనా ప్రజాసేవ చేసే వారిని ఎన్నుకోవాలి.
కుతలేరు వంక ప్రక్షాళన చేయాలి : ప్రతాపరెడ్డి
మండల కేంద్రమైన నార్పల నడి ఒడ్డున ప్రవహించే కుతలేరు వంక పూర్తిస్థాయిలో కలుషితమైందని పూతలేరు వంకను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకొనీ వచ్చి నార్పల లో చాలా విధుల్లో రోడ్లు ఆక్రమణలు జరిగాయి అటువంటి అక్రమ కట్టడాలు నిష్పక్షపాతంగా తొలగిస్తాం అని చెప్పేన వారికి ఓటు వేయాలి.








కామెంట్లు (0)