బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

IPL: పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్

18 నిమిషాల క్రితం

Hardik to Punjab.. Arshdeep to Mumbai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 06:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్‌

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య కీలక ఆటగాళ్ల మార్పిడి జరిగింది. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు మారగా, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రూ.18 కోట్లకే ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ బదిలీకి ఐపీఎల్ ఆమోదం తెలిపింది. హార్దిక్ నిష్క్రమణతో ముంబైకి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు అర్ష్‌దీప్, బుమ్రా కలిసి ముంబై బౌలింగ్‌ను బలోపేతం చేయనున్నారు.


సుదీర్ఘకాలం పాటు తమ ఫ్రాంచైజీలో కొనసాగిన పాండ్యకు వీడ్కోలు చెబుతూ ముంబై ఇండియన్స్ ఓ వీడియో పంచుకుంది. “ఎత్తుపల్లాలతో కూడిన ఈ ప్రయాణంలో.. అన్ని దశల్లోనూ ముంబయి ఇండియన్స్ కథలో నువ్వు భాగమయ్యావు. థాంక్యూ హార్దిక్' అని ఫ్రాంచైజీ రాసుకొచ్చింది. దీంతో పాటు జట్టులో కొత్తగా చేరబోతున్న అర్షీదీప్‌కు స్వాగతం చెబుతూ పోస్టర్‌ను పంచుకుంది. "పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.. ఇక ముంబైకర్' అంటూ అర్షీదీప్‌కు వెల్కమ్ చెప్పింది.


అటు పంజాబ్ కింగ్స్ కూడా ఈ డీల్పై స్పందిస్తూ అర్షీదీప్‌కు వీడ్కోలు పలికింది. “యువ ఆటగాడి నుంచి పంజాబ్ గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన ఈ ప్రయాణం అద్భుతం. 2019లో ఐపీఎల్‌లో నీ మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఈ జట్టుకు ఎన్నో జ్ఞాపకాలను అందించావు. థాంక్యూ అర్ష్ పాజీ..! నువ్వు ఎప్పటికీ మావాడివే” అని పంజాబ్ రాసుకొచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్