ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మున్సిపల్‌ ఛైర్‌‌పర్సన్‌‌ యశోదకు సన్మానం

5 రోజుల క్రితం

మున్సిపల్‌ ఛైర్‌‌పర్సన్‌‌ యశోదకు సన్మానం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 06:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంతకల్లు

ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మున్సిపల్‌ ‌ఛైర్‌‌పర్సన్‌ రామగౌని యశోదను ‌మంగళవారం పట్టణంలోని ఎరుకల సేవాసంఘం ఆధవ్ర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎరుకల సేవా సంఘం పట్టణ అధ్యక్షులు జి.ప్రభాకర్ మాట్లాడుతూ ఎరుకల సామాజిక వర్గ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి సమాజంలో జరుగుతున్న అన్యాయానికి న్యాయం జరిగేలా సహకారాన్ని అందించాలని కోరారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ ఎరుకుల సామాజికవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ కౌన్సిలర్ రామగౌని పవన్‌కుమా‌ర్‌గౌడ్, ఎరుకుల సేవా సంఘం నాయకులు వై.వెంకటేశ్వర్లు, దాసప్ప, ‌కె.శ్రీనివాసులు, రాంబాబు, నాగరాజు, సాగర్, మల్లేష్, వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

ఛైర్‌‌పర్సన్‌‌ను సన్మానిస్తున్న ఎరుకుల సేవాసంఘం నాయకులు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్