ప్రజాశక్తి–మదనపల్లె టౌన్: మదనపల్లెలో అదనపు ఎన్నికల అధికారి బొరయ్యపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించిన కేసులో రౌడీషీటర్ రాజేష్‌ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంతి వీధిలోని నామినేషన్ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుందని ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. నిందితుడిపై గతంలోనే నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రాజేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.
ఎన్నికల అధికారిపై దాడి.. రౌడీషీటర్ రాజేష్ అరెస్ట్
19 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026, 04:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)