ప్రజాశక్తి - సామర్లకోట (కాకినాడ) : ప్రజా సమస్యలపై పోరాడే పార్టీకి పట్టం కట్టాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం సామర్లకోట మున్సిపాలిటీ 32వ వార్డు నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలం హరిబాబు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. వార్డులో తాగునీటి సమస్యలు, పారిశుధ్య,రహదారులు వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని బాలం హరిబాబు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు తమ సమస్యలతో తనను ఎప్పుడైనా సంప్రదించే విధంగా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చే నాయకుడిగా కాకుండా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామినవుతానని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రతి ఏటా రక్తదాన శిబిరం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.ప్రజల అవసరాలను గుర్తించి, వార్డు అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యమని చెబుతూ బాలం హరిబాబు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరణం గోవిందరాజు, విప్పర్తి కొండలరావు, బాలం లక్ష్మి, సురేష్, గోపాల్, వీరేంద్ర, బొమ్మిడి శ్రీను, దారభాని సింహాచలం, ఐటీ వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడే వారిని ఆదరించండి : సిపిఎం
34 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)