ప్రజాశక్తి–వేంపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేంపల్లెలో ఐదుగురికి మించి గుమిగూడితే కేసులు నమోదు చేస్తామని సీఐ నరసింహులు హెచ్చరించారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో 144 సెక్షన్‌తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమిగూడడం, సమావేశాలు నిర్వహించడం, ర్యాలీలు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ర్యాలీలు, సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు తమ ప్రతిపాదకుడితో మాత్రమే రావాలని సూచించారు.
గుంపులుగా ఉంటే కేసులు : సీఐ నరసింహులు
15 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026, 04:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)