ప్రజాశక్తి అమలాపురం రూరల్ : మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అమలాపురంలో ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షించారు.అమలాపురం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లను అమలాపురం సీఐ పి.వీరబాబు, ఎస్సై,రిటర్నింగ్ అధికారి, పంచాయతీరాజ్ శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీరు అన్యం రాంబాబులు మంగళవారం పర్యవేక్షించారు. మండల పరిషత్ కార్యాలయ భవనంలోని కింది అంతస్తులో అమలాపురం మండల ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు, మొదటి అంతస్తులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద బారికేడ్ల ఏర్పాటు, రహదారులపై గుర్తులు, రాకపోకల నియంత్రణ తదితర అంశాలను సీఐ, ఎస్సైలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన భద్రతా, రవాణా నియంత్రణ చర్యలు చేపట్టేలా ఏర్పాట్లను సమీక్షించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి
14 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026, 04:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)