మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా విజయదుర్గ అమ్మవారి బోనాల ఊరేగింపు

32 నిమిషాల క్రితం

Grand procession of Bonalu for Goddess Vijayadurga
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చెముడులంక జాతీయ రహదారి పక్కన పవిత్ర కాలువ నది తీరాన వెలిసి ఉన్న శ్రీ శ్రీ విజయ దుర్గ చంటి బిడ్డల తల్లి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే బోనాల ఊరేగింపు మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకునే కుటుంబ సభ్యులు గ్రామంలో బోనాలు ఊరేగింపు అనంతరం భారీ సంఖ్యలో సమర్పించుకున్నారు. అలాగే పీఠకంలో భవానీలకు మధ్యాహ్నం భిక్షతో పాటుగా ఊరేగింపులో పాల్గొన్న మహిళలందరికీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశారు. దసరా వేడుకలు మొదలుకొని అమ్మవారికి పానకం కావిళ్లు ఈ ఏడాది అధిక సంఖ్యలో యాత్రికులు సమర్పించుకున్నారు. చెముడులంకలో భవానీ మాలధారులు సుమారు 500 మంది వరకు ఉన్నారు. చంటి బిడ్డల తల్లి అమ్మవారి పీఠం వద్ద తమ్మన వెంకటేశ్వరరావు (పండు గురు భవానీ) ఆధ్వర్యంలో తమ్మన వెంకన్న, పాలూరి చిరంజీవి, అన్నందేవుల కిట్టయ్య, రాయుడు వెంకటేష్, తదితరుల పర్యవేక్షణలో వారందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. అలాగే బోనాల ప్రారంభ వేడుకలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయానికి విచ్చేసిన యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో ఆలయ కమిటీని పలువురు ప్రత్యేకంగా అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్