ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాణ్యమైన విద్యను అందించడంపై అవగాహన కార్యక్రమం

12 నవంబర్, 2026

annamayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కలికిరి : ఫ్రీ స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి అంగన్వాడీ కార్యకర్తలకు రెండు రోజులపాటు పోషణ్ భీ -పడాయి భీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టారు. గురువారం స్థానిక ఎంఆర్సి సమావేశ భవనంలో కలికిరి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ భీ పడాయి భీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పోషణ్ భీ పడాయి భీ” కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు. చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆటపాటలు, కథలు మరియు వివిధ బోధనా పద్ధతుల ద్వారా నాణ్యమైన ప్రీస్కూల్ విద్యను అందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల, పోషకాహార లోపాల నివారణ, పిల్లల బరువు మరియు ఎత్తును క్రమం తప్పకుండా పరిశీలించడం, వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యం, పోషకాహారం మరియు ప్రీస్కూల్ విద్యపై అవగాహన కల్పించడం వంటి ముఖ్యమైన అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీస్ వాల్మీకిపురం ప్రాజెక్టు అధికారిణి భారతి, సూపర్వైజర్లు ఆర్. అరుంధతి, ఎస్. రెడ్డి సర్టాజ్ బేగం మరియు కలికిరి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్