ప్రజాశక్తి - పీలేరు : పీలేరు మండలం, తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వివిధ జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల నిర్దేశిత లక్ష్యాలను సాధించడంతోపాటు, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ఆదర్శప్రాయమైన కృషి చేసిన ఐదుగురు వైద్య సిబ్బందికి ఉత్తమ సేవా అవార్డులు అందజేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మదనపల్లి లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య చేతుల మీదుగా డిప్యూటీ డీహెచ్‌ఈఓ డాక్టర్ చంద్రశేఖర్ నాయక్, పీహెచ్‌ఎన్ కొండయ్య, హెల్త్ అసిస్టెంట్ ఎం. కుసుమ, ఏఎన్‌ఎం పి.సి. రెడ్డెప్ప, ఎం. ప్రమీల కుమారి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ అధికారులు, సిబ్బంది పురస్కార గ్రహీతలను అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
తలుపుల పీహెచ్‌సీలో ఐదుగురికి ఉత్తమ సేవా పురస్కారాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 04:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)