ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య) : ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి పడి ఎంపీడీవో తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు ... బి.కొత్తకోట ఎంపీడీవోగా పనిచేస్తున్న అబ్దుల్ సుకూర్ (58) విధి నిర్వహణలో భాగంగా ఈరోజు కురబలకోట మండలం అంగళ్లు నుంచి బైక్ లో బి.కొత్తకోటకు బయలుదేరారు. మొగసాలమర్రి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది.
కుక్క అడ్డొచ్చి బైక్ బోల్తా.. ఎంపీడీవోకు తీవ్ర గాయాలు
20 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026, 12:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)