ప్రజాశక్తి-కలకడ (అన్నమయ్య) : తల్లిపాలతోనే బిడ్డకు శ్రేయస్కరంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని నడిమిచర్ల పంచాయతీ నడిమిచర్ల అంగన్వాడి కేంద్రం నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తాయని సూచించినట్టు తెలిపారు. తల్లిపాలు బిడ్డకు పౌష్టికాహారంగా ఉండి, బిడ్డ ఎదుగుదలకు, తెలివితేటలకు మారుపేరుగా నిలుస్తాయని కొనియాడారు.ప్రతి బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు త్రాగించడంతో మురిపాలలో ఉండే పౌష్టికాహారం బిడ్డ శరీరంలోకి చేరి, ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా ఉండేందుకు అవకాశం ఉందని సూచించినట్టు తెలిపారు.ఇందుకోసం అంగన్వాడి కేంద్రాలలో బాలింతలకు, గర్భవతులకు రాష్ట్ర ప్రభుత్వం బిడ్డ ఎదుగుదలకు కావలసిన ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు తెదేపా కార్యకర్త వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శీను, అంగన్వాడీ కార్యకర్త దేవి, ఆదిలక్ష్మి, వెల్ఫేర్ అసిస్టెంట్ ముత్తు కుమార్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి సహాయకులు, మహిళలు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.
తల్లి పాలతోనే బిడ్డకు శ్రేయస్కరం
07 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 02:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)