ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : తల్లిపాలే బిడ్డకు ఔషధంగా పనిచేస్తుందని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ రాజమ్మ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రమైన కలకడ రాజా వీధిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా తల్లులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లి ఇచ్చే మురిపాలు ఎంత శ్రేష్టమని అవి ఔషధంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పుట్టిన బిడ్డలకు ముడిపారు తాగడం వల్ల అనర్థాలు జరుగుతాయి అన్న మూఢనమ్మకాలను పక్కనపెట్టి మురిపాల వల్ల ఉన్న లాభాలను తల్లులకు వివరించినట్లు తెలిపారు. కాబట్టి ప్రతి తల్లి పుట్టిన వెంటనే బిడ్డకు మురిపాలు తాగించడం ఎంతో శ్రేష్టమని తెలిపామన్నారు. అనంతరం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు భాగంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, సహాయకురాళ్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తల్లులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలే బిడ్డకు ఔషధం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 12:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)