ప్రజాశక్తి-కలకడ (అన్నమయ్య) : ఓట్ల జాబితాలో పేర్లను సరి చేసుకోవాలని తహసిల్దార్ మహేశ్వరి బాయి, ఎంపీడీవో భాను ప్రసాద్ తెలిపారు.మండల కేంద్రమైన కలకడ తహసిల్దార్ కార్యాలయంలో ఓటర్లలో తప్పులున్నవారు ఫారం పూర్తి చేసి స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో పొందుపరిచినచో వాటిని పరిశీలించి సరిచేయడం జరుగుతుందని వారి పేర్కొన్నారు. ఓటర్ జాబితాలో పేర్లు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, చిరునామాలు తప్పులుంటే వాటిని సరిచేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న ఓటర్లందరూ వినియోగించుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, వీఆర్ఏలు, తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాలో పేర్లను సరిచూసుకోండి
22 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 22, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)