నేడు న్యూజిలాండ్‌తో రెండో టి20
మ.12.30గం.ల నుంచి
క్రైస్ట్‌చర్చ్: తొలి టి20లో భారీ లక్షాన్ని ఛేదించిన టీమిండియా.. అదే ఉత్సాహంతో రెండో టి20 బరిలో దిగుతోంది. ఈ మైదానంలో రికార్డు ఛేదన చేసిన టీమిండియా బ్యాటర్లు మరోసారి పరుగుల వరద పారించేందుకు సిద్ధమయ్యారు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం జరిగే రెండో టి20లోనూ టీమిండియా గెలిస్తే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యతలో నిలువనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గజ్జల్లో గాయం కారణంగా రెండో టీ20కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ధ్రువీకరించాడు. తొలి టి20లో ఇషాన్ నిరాశపరిచినా.. సంజు శాంసన్, నమన్ ధీర్‌కి తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండడం శుభ పరిణామం. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కి తోడు మిగతా బౌలర్లు నిరాశపరుస్తున్నా.. బ్యాటర్లకు స్వర్గధామమైన క్రైస్ట్‌చర్చ్‌లో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసుకోవాలంటే చెమటోడ్చాల్సిందే. భారత వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండో టి20కి దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) ధృవీకరించింది. దీంతో గాయపడ్డ కిషన్ స్దానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులోకి రానున్నాడు. అలాగే ఫాస్ట్ బౌలింగ్లో ఓ మార్పు చోటు చేసుకొనే ఛాన్స్ ఉంది. మయాంక్ స్ధానంలో ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి రానున్నాడు.
జట్లు(అంచనా):
ఇండియా: శ్రేయాస్(కెప్టెన్), అభిషేక్, వైభవ్, సంజు(వికెట్ కీపర్), తిలక్, నితీష్, నమన్, అక్షర్, భువనేశ్వర్, అర్ష్‌దీప్, మయాంక్ / ప్రిన్స్ యాదవ్.
న్యూజిలాండ్: సాంట్నర్(కెప్టెన్), షెపర్ట్(వికెట్ కీపర్), అలెన్, మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్, జాకోబ్స్, బ్రాస్‌వెల్, స్మిత్, మిల్నే, హెన్రీ, ఫెర్గుసన్.







కామెంట్‌లు (0)