ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా బాలల దినోత్సవం

14 నవంబర్, 2026

Childrens Day Celebrated in a Grand Manner
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 03:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు కలకడ గ్రంథాలయ శాఖ అధికారి అమరనాథ తెలిపారు.మండల కేంద్రమైన కలకడలో ఉన్న కలకడ గ్రంధాలయ శాఖలో నిర్వహిస్తున్న 59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వారోత్సవాలను ప్రారంభించి సరస్వతి పూజ నిర్వహించి, చిల్డ్రన్స్ డే ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు గ్రంథాలయాన్ని సందర్శించి మీ జ్ఞానాన్ని పెంచుకోవాలని ఆయన సూచించినట్టు తెలిపారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలు, కథల పుస్తకాలు, చదవడం వల్ల జ్ఞానాన్ని పొందుతారని తెలిపారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచి పెట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్