ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భజన మండలికి చినబాబు చేయూత

6 రోజుల క్రితం

aalamuru.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు చేయూతలో భాగంగా ఒక చేతితో ఆదుకుంటూనే, మరో చేత్తో ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ, భక్తి కార్యక్రమాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న టిడిపి సీనియర్ నేత, శ్రీ వెంకటేశ్వర సంస్థల అధినేత ఈదర శ్రీరామచంద్రమూర్తి (చిన్నబాబు)ను పలువురు అభినందించారు. ఈ మేరకు సోమవారం మరోసారి తన దాతృత్వ సేవాభావాన్ని చాటుకుంటూ మండలంలోని పెనికేరుకు చెందిన శ్రీ విఘ్నేశ్వర భజన మండలికి చేయూతలో భాగంగా నూతన హార్మోనియం వాయిద్యాన్ని సమకూర్చి బహూకరించారు. గ్రామంలో భక్తి భావంతో ఏర్పాటైన శ్రీ విఘ్నేశ్వర భజన మండలి సభ్యులు విస్తృతంగా భజన కార్యక్రమాలను నిర్వహిస్తు పలువురి మన్ననలు పొందుతున్నారు. దీంతో వారి భజనలకు హార్మోనియం అవసరమని చిన్నబాబు దృష్టికి రావడంతో స్పందించి ఆయన ఆ వాయిద్యాన్ని సమకూర్చి భజన మండలి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు తమ ఆనందాన్ని వెలిబుచ్చుతూ చిన్నబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు సహకరిస్తున్న ఆయన సేవాభావాన్ని పలువురు అభినందించారు. ఇప్పటికే పలు ఆలయాల అభివృద్ధితో పాటు గ్రామ ప్రజల ఆసక్తి దృష్టిలో ఉంచుకుని, భక్తి కార్యక్రమాలకు తనవంతు సాయాన్ని అందజేస్తూ, సేవా దాతృత్వాన్ని నిలుపుకుంటూ ఆధ్యాత్మిక వైభవానికి తోడ్పడుతున్న చిన్నబాబుకు గ్రామంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల శ్రీ విజయదుర్గ భజన మండలికి చేయూతలో భాగంగా సుమారు రూ.30 వేల విలువైన డోలకం, హార్మోనియం వాయిద్యాలను అందించారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, టిడిపి గ్రామ అధ్యక్షుడు గొడవర్తి భాస్కరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్