సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిసరాల పరిశుభ్రత మన ప్రధాన లక్ష్యం

22 ఆగస్టు, 2026

Cleanliness of the surroundings is our primary goal.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 01:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : పరిసరాల పరిశుభ్రత మన ప్రధాన లక్ష్యంగా భావించాలని డిప్యూటీ ఎంపీడీవో చక్రపాణి పేర్కొన్నారు.శనివారం మండలంలోని నడమిచర్ల పంచాయతీ నడిమి చర్ల ప్రాథమిక పాఠశాలలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపి, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టాలన్నారు. విద్యార్థి దశనుండే పరిసరాల పరిశుభ్రత పై మక్కువ పెంచుకొని, ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించినట్లు తెలిపారు. కేంద్ర,రాష్ట్రాలు సైతం పరిసరాల శుభ్రత పట్ల శ్రద్ధ వహిస్తూ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందని వాటిని ప్రతి రాష్ట్రం అమలు చేసేలా చర్యలు చేపడుతున్న విషయం మనందరికీ తెలిసిందని కొనియాడారు.కావున మన ఇల్లు, పాఠశాలలు మరియు వసతి గృహాల చుట్టుప్రక్కల చెత్తాచెదారంలను నిలువ చేసుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకొని మన చుట్టూ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని సూచించినట్టు తెలిపారు.అలాగే ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని సూచించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు శ్రీను, అంగనవాడి సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్