శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరుతడి పంటలపై రైతులు మక్కువ చూపాలి

14 జులై, 2026

annamayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కలకడ : రైతులు ఆరుతడి పంటలపై మక్కువ చూపి వ్యవసాయాన్ని పెంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎం.ఆర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మండలంలోని బాటవారిపల్లి దేవలపల్లి అయితేలలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కి గాను ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం మంగళవారం నుండి ప్రారంభమైందని అన్నారు. దీనిలో భాగంగా వ్యవసాయ శాఖ అందిస్తున్న కార్యక్రమాల గురించి వివరించామన్నారు. ఎల్ నినో కారణం గా వేరుశనగ పంటను వర్షా బావ పరిస్థితులను అనుసరించి ఈనెల 30 వరకు విత్తనాలను విత్తుకోవచ్చని రైతులకు సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే వేరుశనగ పంట సాగు చేసిన వారు కలుపు తీసుకొని, గంటులకు డి ఏ పి వేసుకోవాలని సూచించారు. పొడి వాతావరణం కారణంగా రసం పీల్చే పురుగులు ఆశించడానికి అవకాశం ఎక్కువగా ఉందని, దీంతో రైతులు తమ పంటలకు పసుపు అట్టలు ఎకరానికి 10 పెట్టుకోవాలని, అలాగే ఇమిడాక్లిప్రిడ్ 0.3 మి లీ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలన్నారు. తరువాత ఏపీఏ ఐఎంఎస్ యాప్‌ ద్వారా యూరియా, డిఎపి పొందవచ్చని రైతులకు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యాలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్