శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇండోనేషియా భూకంపంలో 20 మంది మృతి

1 గంట క్రితం

Indonesia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 02:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జకార్తా : ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో 20మంది మరణించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లోరెస్‌ ద్వీపం సమీపంలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.7గా నమోదైంది. పలువురు గాయపడగా, భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాగేకీయో ప్రాంతంలో సుమారు 2,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు కూడా దెబ్బతిన్నాయి. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికను జారీ చేసిన అధికారులు మూడు గంటల తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక మీటరు లోపు ఎత్తైన అలలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం అనంతరం పలుచోట్ల ప్రకంపనలు కొనసాగుతుండటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్