బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అరెస్ట్

14 నిమిషాల క్రితం

arest.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 12:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వాల్మీకిపురం(అన్నమయ్య): వాల్మీకిపురం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడు చింతల సాయికృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయినగర్‌లోని వైసీపీ కార్యాలయం, సాయి మందిరంలోకి ప్రవేశించిన పోలీసులు సాయికృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్థానిక గాంధీ బస్టాండ్‌లో బైఠాయించి ధర్నా నిర్వహించారు. తన కుమారుడిని అరెస్ట్ చేసి, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా పోలీసులు తరలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చింతల రామచంద్రారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైసీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్