బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దసరా వినోదాలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం - ఇద్దరు విద్యార్థులు మృతి

20 నిమిషాల క్రితం

Accident while returning from Dasara festivities – two students killed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 01:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మక్కువ మండలంలోని పాపయ్య వలస గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన వినోద కార్యక్రమానికి వెళ్లి స్వగ్రామానికి వెళుతూ ... ప్రమాదానికి గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చెప్పవచ్చంపేట గ్రామానికి చెందిన వైకుంఠపుగిరి, శివకోటిరవి ఇద్దరు కలిసి దసరా వినోద కార్యక్రమాలను చూడటానికి పాపయ్య వలస గ్రామానికి వెళ్లారు. వినోద కార్యక్రమాల అనంతరం తెల్లవారుజామున స్వగ్రామానికి బైక్ పై వస్తుండగా పాపయ్య వలస గ్రామ సమీపంలో వాహనం అదుపుతప్పడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వైకుంఠపుగిరి అక్కడికక్కడే మృతి చెందగా, గాయాలపాలైన శివకోటి రవిని పార్వతీపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిసింది. ఇద్దరు స్నేహితులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలుస్తుంది. విద్యార్థుల మృతితో చెప్పబుచ్చంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సాలూరు రూరల్ ఎస్సై రవీందర్ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్