నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారని వైసీపీ నేతల ఆరోపణ.. రాళ్ల దాడి
ప్రజాశక్తి – పుంగనూరు (అన్నమయ్య) : పుంగనూరు పట్టణంలో ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైసీపీ నాయకులను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. కమతంపల్లికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరమ్మ, ఆమె అనుచరులు నామినేషన్లు దాఖలు చేసేందుకు కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారని వైసీపీ నాయకులు ఆరోపించారు. దీంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రాళ్ల దాడి చోటుచేసుకోవడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.







కామెంట్‌లు (0)