నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఉద్రిక్తత
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పిడుగురాళ్ల జడ్పీటీసీ అభ్యర్థి భారతి, ఆమె భర్త పెద్ద లక్ష్మారెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో లక్ష్మారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గుమిగూడిన జనాన్ని చెదరగొట్టారు. అయితే, ఈ దాడికి గల కారణాలు ఏమిటి? దాడికి పాల్పడినవారు ఎవరు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.







కామెంట్‌లు (0)