గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సమక్షంలో చేరికలు.
ప్రజాశక్తి – గరుగుబిల్లి (మన్యం) : వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు వార్డు సభ్యులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో బుధవారం గుమ్మలక్ష్మీపురంలో ఈ చేరికలు జరిగాయని మండల టీడీపీ కన్వీనర్ మరడాన నారాయణస్వామి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ నాయకుల వైఖరితో విసిగిపోయి పలువురు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తుందని, కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను ఎప్పటికీ చిన్నచూపు చూడబోమని స్పష్టం చేశారు. టీడీపీలో చేరిన వారందరికీ సముచిత గుర్తింపు, ప్రాధాన్యత ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరడాన తవిటి నాయుడు, మర్రపు పురుషోత్తమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)