ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పీలేరు డిపో మేనేజర్ దౌర్జన్యం

1 గంట క్రితం

High-handed behavior by Pileru Depot Manager
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 05:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కలకడ (అన్నమయ్య) : నియోజకవర్గ ముఖ్య పట్టణం పీలేరు రోడ్డు రవాణా సంస్థ డిపో మేనేజర్ ఎస్ ఎం డి రోషన్ దౌర్జన్యం దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని  స్థానిక ప్రయాణికులు వాపోతున్నారు.అసలు మనం భారతదేశంలో ఉన్నామా లేక పాకిస్థాన్లో ఉన్నామా అనే సందేహం వెళ్లి విరుస్తున్నట్లు పీలేరు డిపో మేనేజర్ వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం వేకూజమున సుమారు నాలుగు గంటల 30 నిమిషాల కాలంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు పీలేరు ఆర్టీసీ బస్టాండులోకి వచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.ఈ క్రమంలో పీలేరు డిపో మేనేజర్ ఎస్ ఎం డి రోషన్ అదే సమయంలో ఆర్టీసీ బస్టాండ్ లో ఉండి, కర్ణాటక బస్సును దౌర్జన్యంగా ఆపి, అందులో ఉన్న ప్రయాణికులను దింపి, ఆ బస్ కండక్టర్ వద్ద ఉన్న ఎస్సార్ ను తీసుకొని, దౌర్జన్యం చేసినట్లు పలువురు బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు ఆవేదన చెందారు.అయితే కర్ణాటక బస్సు ఆ సమయంలో బస్టాండ్ లోకి రావడం తప్పు ఏమైనా జరిగిందా అంటూ పలువురు విమర్శలు చేశారు.అదే సమయంలో పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెంగళూరుకి బయలుదేరుతుంది, కనుక ఆ సమయంలో ప్రయాణికులను కర్ణాటక బస్సులో తీసుకువెళ్లడం సరికాదు అంటూ ప్రయాణికులను దింపి, పీలేరు ఆర్టీసీ బస్సులు ఎక్కించడం ఎంతవరకు సబబు, సమంజసం అని పలువురు ప్రయాణికులు ఆవేదనకు గురయ్యారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలు రకాల డిపోలకు చెందిన బస్సులు కర్ణాటక కు వెళ్లినప్పుడు వారు కూడా ఇలాగే ప్రవర్తిస్తే బాగుంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనా పీలేరు ఆర్టీసీ డిఎం చేస్తున్న పనితీరు బాగోలేదని, అతని పద్ధతి, పనితీరును మార్చుకోవాలని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కర్ణాటకకు వెళ్లిన ఆంధ్ర బస్సులను, ముఖ్యంగా పీలేరుకు చెందిన రెండు బస్సులను వారు నిలిపివేసి, నిలదీస్తే మన పరువు ఎంతవరకు ఉంటుందని ప్రయాణికులు చెవులు కోరుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పీలేరు ఆర్టీసీ డిఎం పై చర్యలు చేపట్టవలసిందిగా పలువురు కోరుతున్నారు.


విచారించి పీలేరు డిఎం పై చర్యలు తీసుకుంటాము- అన్నమయ్య జిల్లా ఆర్ఎం రమేష్ బాబు

పీలేరు ఆర్టీసీ డిఎం  ఎస్ ఎండి రోషన్ చేసిన పనితీరుపై అన్నమయ్య జిల్లా ఆర్ఎం రమేష్ బాబును వివరణ కోరగా, డి ఎం ఎస్ ఎం డి రోషన్  పై విచారణ జరిపి, ఇలాంటి సన్నివేశాలు పునరావృతం కాకుండా మరియు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించకుండా చర్యలు చేపడతామని ఆర్ ఎం వివరించారు.పీలేరు ఆర్టీసీ డిపోలో  పనిచేస్తున్న సిబ్బందిని కొంతమందిని ఒకరకంగా, మరి కొంతమందిని ఒక విధంగా డిఎం వ్యవహరిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా చర్యలు చేపట్టి కట్టుదిట్టం చేయడం జరుగుతుందని ఆర్ ఎం ప్రజాశక్తికి వివరణ ఇచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్