ప్రజాశక్తి-పీలేరు : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పీలేరు ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. చంద్రశేఖర్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక “బెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - ఐడిసి మెరిట్ అవార్డు” అందుకున్నారు. శనివారం మదనపల్లెలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ చేతుల మీదుగా చంద్రశేఖర్ రెడ్డి అవార్డును అందుకున్నారు. పీలేరు ఆపరేషన్ డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడం, అంతరాయాలను తగ్గించడం, వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించడం, సిబ్బందిని సమర్థవంతంగా సమన్వయం చేయడం, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడంలో చూపిన ప్రతిభ, అంకితభావం, విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డిని పీలేరు డివిజన్ పరిధిలోని డిఈఈ లు, ఏఈలు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది అభినందిస్తూ, ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు పీలేరు ఆపరేషన్ డివిజన్‌కు రావడం తమకు ఎంతో గర్వకారణంగా నిలిచిందని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఉత్తమ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా వై. చంద్రశేఖర్ రెడ్డికి ఐడిసి మెరిట్ అవార్డు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)