గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పింఛన్ల వ్యవస్థకు పునాది వేసింది ఎన్టీఆర్

1 గంట క్రితం

ward
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 11:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- పెన్షన్లు పంపిణీలో ఎమ్మెల్యే కిషోర్

ప్రజాశక్తి-కలికిరి: పెన్షన్లు వ్యవస్థకు పునాది వేసిన ఘనుడు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని ఎమ్మెల్యే మందార కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదని, తమ ఆరోగ్య భద్రతకు ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా పండగలా కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. కలికిరి మండలం పత్యేగడ పంచాయతీ పాలెం కురవపల్లి, కొండ కావలి పల్లిలో గురువారం ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, గతంలో రూ.200 ఉన్న పింఛన్ ను నేడు రూ.4000 కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పింఛన్ పొంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్