ప్రతిభ అవార్డుకు ఎంపికైన నారాయణ EM స్కూల్ విద్యార్థిని
కే.దివ్య మాలికకు హృదయపూర్వక అభినందనలు.
ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య) : కృషి, పట్టుదల, క్రమశిక్షణకు ప్రతిరూపంగా నిలిచి ప్రతిభ అవార్డుకు ఎంపికైన కే. దివ్య మాలిక తమ పాఠశాలకు గర్వకారణంగా నిలిచిందని నారాయణ ఇంగ్లీషు మీడియం నిర్వాహకులు తెలిపారు. విజయం అనేది ఒక్కరోజులో సాధించేది కాదు... నిరంతర శ్రమ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కలిసినప్పుడు అది సాకారమవుతుంది. దివ్య మాలిక సాధించిన ఈ ఘనత ప్రతి విద్యార్థికి ఒక గొప్ప ప్రేరణ. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, తన ప్రతిభతో పాఠశాలకు, తల్లిదండ్రులకు, సమాజానికి మరింత గౌరవాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. "ప్రతిభను గుర్తిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రోత్సాహం అందిస్తే విజయాలు మరింత చేరువవుతాయి."అని స్కూల్ ప్రిన్సిపల్, సిబ్బంది తెలిపారు.








కామెంట్‌లు (0)