ప్రజాశక్తి-పీలేరు : పీలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా సి. రవీంద్రారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా, పీలేరు గ్రామ పంచాయతీ ప్రజలు, ఉద్యోగులు, సిబ్బంది పూర్తి సహకారంతో పంచాయితీ సమగ్రాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. పారిశుధ్యం, సురక్షితమైన మంచినీటి సరఫరా, వీధులు, వీధి దీపాల నిర్వహణ, రహదారుల అభివృద్ధి వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ, ఎలాంటి అవినీతికి తావు లేకుండా విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన అజెండా అని, ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా కార్యాలయానికి వచ్చి తెలియజేయవచ్చని అన్నారు. కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన రవీంద్రారెడ్డికి పంచాయతీ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామమూర్తి, టిడిపి మీడియా ప్రతినిధి పోలిశెట్టి సురేంద్ర (చాపల సూరి), ఇతర టిడిపి నాయకులు, కార్యకర్తలు కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శిని కలిసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పీలేరు గ్రామపంచాయతీ ఇన్చార్జి కార్యదర్శిగా పనిచేస్తున్న బ్రహ్మానంద రెడ్డి తిరిగి గుర్రంకొండ డిప్యూటీ ఎంపీడీవో గానే తన పూర్తిస్థాయి విధులు కొనసాగించనున్నారు.
పీలేరు పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సి. రవీంద్రా రెడ్డి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 04:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)