ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల మహిళా సాధికారత విభాగం (WEC), నేషనల్ యూత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరిగిన "నారీ శక్తి ఉదయ్ – 2026" జాతీయ వర్క్‌షాప్ శుక్రవారం (జూలై 10) ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు రాజమండ్రి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డా. డి. పురందేశ్వరి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఎన్‌సీసీ విద్యార్థినుల నుండి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించినప్పుడే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ మూడు రోజుల సదస్సులో భాగంగా మహిళల ఆరోగ్యం, ఉచిత వైద్య పరీక్షలు, డిజిటల్-ఆర్థిక అక్షరాస్యత, మరియు మహిళా హక్కులపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామచంద్ర ఆర్.కె, కన్వీనర్ డా. జి. తేజస్విని, నేషనల్ యూత్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ విభూతి రమన్ ఆచార్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచితంగా పోషకాహార కిట్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. చివరగా జాతీయ గీతాలాపనతో ఈ ఉత్సవం ముగిసింది.
'నారీ శక్తి ఉదయ్ – 2026' జాతీయ సదస్సు ముగింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)