శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

5 నుంచి 8వ తరగతిలో మిగులు సీట్ల అడ్మిషన్లకై నోటిఫికేషన్ విడుదల

2 గంటల క్రితం

peeleru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 04:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పీలేరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీలేరు మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మిగులు సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పాఠశాల ప్రధానాచార్యులు ఎస్. ఫక్రున్నిస శుక్రవారం ఓ ప్రకటన తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5, 6, 7, 8వ తరగతుల్లోని ఆంగ్ల మాధ్యమంలో సీట్లు భర్తీ చేయనున్నామని అన్నారు. పీలేరు మండలం, చిత్తూరు రోడ్డులోని ఎం.జె.ఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో జూలై 10 నుంచి 13వ తేదీ వరకు ఆఫ్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకువచ్చి దరఖాస్తు ఫారాలను పొందవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష జూలై 15న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా తరగతులకు సంబంధించిన గత విద్యా సంవత్సరపు అంశాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని, మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం మిగులు సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు పీలేరు ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ బాలికల గురుకుల పాఠశాల ప్రధానాచార్యులను లేదా 9515120268, 94923 77011, 99669 17537, 88862 79155 సెల్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్