ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని మూలస్థానం నక్కల డ్రైన్ కల్వర్టు నిర్మాణ పనులను గ్రామ ప్రత్యేకాధికారి ఏంఏఓ బి మీనా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ డ్రైన్ పై కల్వర్టు నిర్మించి చాలా కాలమైందని, అది ఇప్పుడు శిథిలమైందన్నారు. దీంతో రైతుల అభ్యర్థనతో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతన కల్వర్టు నిర్మాణం చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఈ వారంలో కల్వర్టు నిర్మాణం పూర్తవుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దేవి ప్రియ, వీఆర్వో రవికుమార్, కూటమి నాయకులు గానుగుల చిన్న, దొంగ భాస్కరరావు, తోట చిన్న, లాలం శ్రీను, ఉప్పులూరి సత్తిపండు తదితరులు పాల్గొన్నారు.
కల్వర్టు నిర్మాణ పనులు పరిశీలన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 04:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)