- నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు
- డ్రోన్లతో నిరంతర నిఘా.. 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు
ప్రజాశక్తి-పీలేరు: అన్నమయ్య జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోకి అనధికార వ్యక్తులు, వాహనాలు ప్రవేశించకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.







కామెంట్‌లు (0)