శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వడ్డిపల్లిలో తాగునీటి సమస్య పరిష్కారం

1 గంట క్రితం

water.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 11:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కలకడ(అన్నమయ్య): మండలంలోని కదిరాయచెరువు గ్రామ పంచాయతీ పరిధి వడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాజీ సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న కమలనాథ్ పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు చొరవతో కొత్త మోటార్, స్టార్టర్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన పైప్‌లైన్ పనులు పూర్తి చేశారు. దీంతో గ్రామంలో తాగునీటి సరఫరా పునరుద్ధరించబడింది. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, మాజీ సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న కమలనాథ్‌లకు వడ్డిపల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జి గంట శ్రీనివాసులు నాయుడు, మాజీ సర్పంచ్‌లు గోపాల్ నాయుడు, విశ్వనాథ శెట్టి, మల్లికార్జున నాయుడు, రవి శేఖర్, రామచంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్