శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మంచు దుప్పట్లో సోమల

6 రోజుల క్రితం

somala.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 11:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – సోమల(అన్నమయ్య): సోమల మండలంలో గత వారం రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ప్రతిరోజూ ఉదయం 7 గంటల వరకు దట్టమైన మంచు కురుస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా ఉదయం వేళల్లో రైతులు పొలాలకు వెళ్లేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సాయంత్రం 8 గంటలకే చలి తీవ్రతకు జనసంచారం తగ్గి వీధులన్నీ బోసిపోతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం 6.26 గంటలకు మంచు దుప్పటిని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తున్న అందమైన దృశ్యాన్ని ప్రజాశక్తి కెమెరా బంధించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్