ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట నగర పంచాయతీ గా ఏర్పడి మొదట సారి గా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఎస్పీ ప్రసాద్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నామినేషన్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఎస్పీ ప్రసాద్ సూచించారు.
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
14 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)