కూటమి నాయకులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. తోపులాట
ప్రజాశక్తి-రైల్వేకోడూరు: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూటమి నాయకులు, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, తోపులాటకు దారితీసింది. రైల్వేకోడూరులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నామినేషన్ కేంద్రంలో ఇప్పటికే అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారని, వారు నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత వైసీపీ అభ్యర్థులు వెళ్లాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది.








కామెంట్లు (0)