గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ దుర్మరణం

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కలకడ: ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన కె.వి పల్లి మండలంలో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండల పరిధిలోని పీలేరు–సుండుపల్లి రహదారిపై వగళ్ల నారుమాకుల మిట్ట వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ పూజారి నిరంజన్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. పీలేరు వైపు నుంచి కె.వి.పల్లి వైపు ట్రాక్టర్ వెళ్తుండగా, నారుమాకుల మిట్ట దిగువ ప్రాంతంలో అదుపుతప్పి రహదారికి కుడివైపున ఉన్న 11 కేవీ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న పూజారి నిరంజన్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కె.వి.పల్లి మండలం నూతన కాల్వకు చెందిన వడ్డేపల్లి నివాసి పూజారి రాజన్న కుమారుడిగా గుర్తించారు. ట్రాక్టర్ కొత్తది కావడంతో తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరు అందుబాటులోకి రాలేదు. సమాచారం అందుకున్న కె.వి.పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతదేహాన్ని తదుపరి చర్యల నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ముని సుందరం తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్