- 15వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల దీక్ష
ప్రజాశక్తి-పీలేరు: వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మోకాళ్లపై నిలుచుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు బుధవారం పీలేరు తహశీల్దారు కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్ష 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏలు పే స్కేల్ అమలు చేయాలని, మృతి చెందిన వీఆర్ఏల నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు ఉద్యోగిోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు తాము తమ సహాయ నిరాకరణ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘ నాయకులు కె.నాగరత్నం, పి.ఆంజనేయులు, జి.వెంకటరమణ, రవి, పి.ధనలక్ష్మి, జి.ఆదినారాయణ, మనోజ్, రమణ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)