ప్రజాశక్తి – చీరాల: ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని వారికీ చేరనీయకుండానే దళారి వ్యాపారులు అక్రమంగా సొమ్ము చేసుకుంటూ ఊళ్ళు దాటిచ్చేస్తున్నారు. అధికారులు ఎన్ని కేసులు పెడుతున్న పట్టినట్టుగా వ్యవహరిస్తూ తమదైన శైలిలో కాసుల కోసం కక్కుర్తి పడుతూ పేదల పొట్ట కొడుతున్నారు.ఇదే తరహాలో చీరాల నుండి ఒంగోలు కు తరలిస్తూన్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని మండలంలోని జాండ్రపేట గుమాస్తాల కాలనీలో ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని వాహనాన్ని చీరాల ఒకటవ పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఓంకార్ మాట్లాడుతూ.. తమకు అందిన సమాచారం మేరకు రేషన్ బియ్యం పంపిణీ దుకాణాల నుండి డీలర్ల వద్ద అక్రమంగా కొనుగోలు చేసి చీరాల నుండి ఒంగోలుకు తరలిస్తున్న బియాన్ని అడ్డుకున్నామని తెలిపారు.తమ ప్రాథమిక విచారణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకి పాల్పడిన వ్యక్తి సాంబశివరావుగా గుర్తించి అతనిపై 6ఎ కేసుతో పాటు,క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రజా పంపిణీ బియ్యంలో అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులో తప్పవని ఆయన హెచ్చరించారు ఈ దాడులలో చెరుకుపల్లి చెరుకుపల్లి సిఎస్ఆర్ఐ ఎ అబ్రహం పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్‌మెంట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 25, 2026, 09:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)