ప్రజాశక్తి - యద్దనపూడి (బాపట్ల) : మండల కేంద్రమైన యద్దనపూడి గ్రామానికి చెందిన పల్లెపోగు అభిలాష్ ఆగస్టు 19-20 తేదీలలో నేపాల్ దేశంలో జరిగిన అంతర్జాతీయ ఇండో -నేపాల్ ఏరో స్కెట్ బాల్ సిరీస్ కు భారతదేశం తరుపున పాల్గొని మొత్తం అయిదు విభాగల్లో ఒక గోల్డ్ మెడల్, రెండు సిల్వర్ మెడల్ లు, రెండు బ్రాంజ్ మెడల్స్ ను సాధించాడు. అభిలాష్ కు కోచ్ ఫిరోజ్ ఖాన్ శిక్షణ నిచ్చారు. విద్యార్థి తండ్రి పి.రవి యద్దనపూడి మండలంలో పశువైద్య సహాయకుడుగా పని చేస్తున్నారు. అభిలాష్ మార్టూరు వివేకానంద నెక్స్ట్ జెన్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు.అభిలాష్ కు జిల్లా వాసులు గ్రామస్తులు, స్కూల్ యాజమాన్యం అధ్యాపకులు తదితరులు అభినందనలు తెలియజేశారు.







కామెంట్‌లు (0)